22 June, 2026 | 2:58 AM

మోదీ 3.0.. ఈ స్టాక్స్ బెస్ట్

16-06-2024 12:33 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడవ టెర్మ్‌లో కేంద్ర ప్రభుత్వం యథాప్రకారం విధనాలను కొనసాగిస్తుందని యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నది. రోడ్డు, మెట్రో, రైల్వేలు, డిఫెన్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ టెక్నాలజీస్ తదితర మౌలిక వసతులపై దృష్టి పెడుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. పాలసీ కొనసాగింపు, బడ్జెట్‌పై అంచనాలు, రుతుపవనాల  ప్రగతి, క్యాపెక్స్ ఎజెండా, ఫిస్కల్ కన్సాలిడేషన్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రికవరీ వంటి అంశాలతో స్టాక్ మార్కెట్ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని యాక్సిస్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొన్ని లార్జ్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లను సిఫార్సు చేసింది.