13-08-2025 07:31:37 PM
తెలంగాణ రాష్ట్ర మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల..
నకిరేకల్ (విజయక్రాంతి): భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల(Farmers Association State Convener Kandala Pramila) డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు మహిళా రైతు సంఘం ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలో ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమెరికా పెట్టుబడిదారీ వర్గం కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా మారిన మోడీ విధానాలను దుయ్యబట్టారు. కరెంటు మోటార్లకు మీటర్లు బిగించే విధానాలను వెనక్కి తీసుకోవాలన్నారు.
దేశంలో వ్యవసాయం లాభసాటిగా ఉండటం కోసం వ్యవసాయ పనిముట్ల ధరలు తగ్గించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఇంగ్లాండ్ ఒప్పందం నుండి తప్పుకోవాలన్నారు. ఈ ఒప్పందాలు జాతీయ ప్రయోజనాలకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) సీనియర్ నాయకులు యానాల కృష్ణారెడ్డి, నకిరేకల్ మండల అధ్యక్షులు యానాల వెంకట రంగారెడ్డి, ప్రతినిధులు గింజల లక్ష్మి, గురుజ స్వరూప, కర్నే పరమప్ప, పరమేశం, కప్పల అంజయ్య, మర్రి ఎల్లయ్య పాల్గొన్నారు.