calender_icon.png 14 August, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంచి కొడుతున్న వానలు

13-08-2025 07:33:44 PM

మోతె: మండలంలోని రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ సూచనల ప్రకారం గడిసిన రోజు నుంచి నేడు మరో మూడు నుంచి ఐదు రోజుల వరకు విపరీతంగా వర్షాలు పడనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రతి గ్రామంలో ఎలాంటి పురాతన భవనలు కట్టడాల వైపుకు ప్రజలు ఎవరు వెళ్ళవద్దని అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గ్రామాలలో చెరువులు కుంటలు నిండుగా పారి ప్రవహించడంతో ప్రమాదవాషాత్తు మునిగి పోవడం సెల్ ఫోన్ ల తో ఫోటోలు తియ్యడం వంటివి చేయవద్దని తహసీల్దార్ యం వెంకన్న మండల అభివృద్ధి అధికారి ఆంజనేయులు యస్ ఐ టి. అజయ్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా గ్రామాలలో నిరాశ్రాయులు ఉంటే యం పి డి ఓ కార్యాలయం లో ఆశ్రయం పొందాలని కోరారు. చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని తెలిపారు.  ప్రమాదం బారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా కాంట్రోల్ రూమ్ నెంబర్ 6281492368   కు సమాచారం అందించాలని కోరారు.