13-08-2025 07:28:45 PM
ఇస్రో శాస్త్రవేత్త హర్షవర్ధన్ రెడ్డి
నారాయణఖేడ్: ప్రపంచ విజ్ఞాన అభివృద్ధిలో భారతీయ శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని దానిని ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి సైన్స్ అండ్ టెక్నాలజీలో తమవంతు పాత్రను పోషించాలని తిరువనంతపురం ఇస్రో శాస్త్రవేత్త హర్షవర్ధన్ రెడ్డి(ISRO Scientist Harshavardhan Reddy) అన్నారు. బుధవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నారాయణఖేడ్లో ఏర్పాటుచేసిన అంతరిక్ష పరిశోధన విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై మన ప్రాంతానికి చెందిన మార్డి నివాసి ఎన్నం హర్షవర్ధన్ రెడ్డి కేరళలోని తిరువనంతపురం ఇస్రో కేంద్రంలో పని చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి విజ్ఞానం పట్ల అవగాహన పెంచుకొని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు.
మానవ జీవితంలో సైన్స్ అనేది ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని దానిని ఎంతగా అభివృద్ధి పరుస్తే అంత సమాజం ఉన్నతంగా జీవిస్తుందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలో చేశారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు తగిన స్థలాలు సూచనలిస్తూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు రాజశేఖర్ వెంకట్రావు రాజయ్య చంద్రశేఖర్లక్ష్మణ రావు ధన్సింగ్ తదితరులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.