calender_icon.png 24 August, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్ బాబు హెల్త్ బులిటెన్

11-12-2024 12:32:50 PM

హైదరాబాద్: నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మోహన్ బాబుకు ఎడమకంటి కింద గాయాలు గుర్తించామని, ఆయన అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని కాంటినెంటల్ ఆస్పత్రి ప్రకటించింది. మోహన్ బాబు హృదయస్పందనలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వెల్లడించింది. బీపీ పెరిగిపోవడంతో మంగళవారం రాత్రి మోహన్ బాబును ఫ్యామిలీ మెంబర్స్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. 200 బీపీతో మోహన్ బాబు ఆస్పత్రికి వచ్చారని వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని కాంటినెంటల్ వైద్యులు పేర్కొన్నారు. కాగా, మోహన్ బాబు దాడిపై ఫిలింనగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు జర్నలిస్టులు నిరసన తెలిపారు. మోహన్ బాబు క్షమాపన చెప్పాలంటూ జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు.