calender_icon.png 24 August, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమానాశ్రయం అంటే రవాణా సౌకర్యం మాత్రమే కాదు

11-12-2024 02:36:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): విమానాశ్రయం అంటే కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు, ఉపాధి మార్గం, సాంస్కృతిక కేంద్రామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. శంషాబాద్ నోవాట్ లో ఎయిర్ పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ను పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ ని వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మెహన్ నాయుడు మాట్లాడుతూ... అప్పట్లో 5 వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్యమైన విషయం కాదని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల కాన్సెప్ట్ వెనుక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఉందన్నారు.

చంద్రబాబు దార్శనికత వల్లే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఐటీ విప్లవం, ఇప్పటికీ దేశాభివృద్ధికి ఐటీ చోదకశక్తని చంద్రబాబు నమ్ముతారని రామ్మోహన్ పేర్కొన్నారు. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడి సరికొత్త సేవలు అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 24 విమానాశ్రయాల్లో డీజీయాత్ర టెక్నాలజీ, డేట ఎనలటిక్స్ ను వాడి సేవలను మరింత మెరుగ్గా అందిస్తామన్నారు.