17-08-2025 09:44:10 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో ముత్యాలమ్మ తల్లికి గ్రామస్తులు ఘనంగా బోనాల సమర్పించారు. అదేవిధంగా వలిగొండ మండల కేంద్రంలో గొల్ల, కురుమలు బీరప్పకు బోనాలు సమర్పించగా మండలంలోని వివిధ గ్రామాల్లో బోనాల సందడి నెలకొంది. బోనాల సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు డప్పు,చప్పులతో గ్రామదేవతలకు మహిళలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.