01-05-2025 12:48:13 AM
600 మార్కులకు గాను 564 మార్కులు సాధించి రికార్డు సృష్టించి విద్యార్థి కీర్తన
8 మంది విద్యార్థులు 500పైగా మార్కులు
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 30: అమ్మ స్వీపర్.. బిడ్డ కష్టపడి చదివి మండలంలోనే టాఫర్ నిలిచింది మండలి కీర్తన. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, మజీ ద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ స్వీపర్‌గా చేస్తుండగా.. ఆమె తండ్రి మేస్త్రీ పనిచేస్తుంటాడు. మండలంలోనే ఏ ప్రభుత్వ పాఠశాలలో రాని ఫలితాలు ఒక మజీద్‌పూర్‌లోనే వచ్చాయి. పది ఫలితాల్లో మజీద్‌పూర్ విద్యార్థులు ప్రభంజ నం సృష్టించారు.
600 మార్కులకు గాను.. మండలి కీర్తన 564 మార్కులు సాధించి రికార్డు సొంతం చేసుకుంది. ఎడ్ల శివతేజ (537), బొడ్డు సాత్విక (527) తరువాత స్థానం నిలిచారు. మజీద్‌పూర్ పాఠశాలకు చెందిన 39 మంది విద్యార్థులకు పరీక్షలు రాయగా.. 39 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 8 మంది విద్యార్థులకు 500పై బడి మార్కులు సాధించారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో మారే ఇతర పాఠశాలలో విద్యార్థులకు ఈ స్థాయిలో మార్కులు రాలేదు.
మండలంలోనే మొదటి స్థానంలో నిలిచింది మజీద్‌పూర్ పాఠశాల. పది ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించి విద్యార్థులను స్కూల్ హెచ్‌ఎం. విజయ భాస్కర్ రెడ్డి అభినందించారు. అదే విధంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృష్టి చేసిన ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల పట్టుదల, పాఠశాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చిన దాతల సహకారంతోనే ఈ ఫలితాలు వచ్చాయని వి. విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు.