01-05-2025 12:48:18 AM
కూసుమంచి , ఏప్రిల్ 30 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుదవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కూసుమంచి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయి.. మండలం నుండి మొత్తం 504 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాయగా 91.67 శాతంతో 462 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ నుండి 133 మంది విద్యార్థులకు 117 మంది , నాయకన్ గూడెం జడ్.పి.హెచ్.ఎస్ 19 మందికి 19 మంది విద్యార్థులు , చేగోమ్మ జడ్.పి.హెచ్.ఎస్ 23 మంది విద్యార్థులకు 19 మంది , జడ్పీహెచ్‌ఎస్ నేలపట్ల 14 మంది విద్యార్థులకు 13 మంది , కూసుమంచి కేజీబీవీ 36 మంది విద్యార్థులకు 28 మంది , జడ్.పి.హెచ్.ఎస్ జీళ్లచెరువు 10 మంది విద్యార్థులకు 8 , జడ్.పి.హెచ్.ఎస్ మల్లెపల్లి 32 మందికి 25 , జడ్పీహెచ్‌ఎస్ జక్కేపల్లి 17 మంది విద్యార్దులకు 16 , జడ్.పి.హెచ్.ఎస్ ఈశ్వర మాదారం 10 మందికి 10 మంది , జడ్.పి.హెచ్.ఎస్ పాలేరు 15 మంది విద్యార్దులకు 15 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.. కూసుమంచి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల నుండి సత్యాన్షి అనే విద్యార్థికి 547 , దీపాన్విత 544 మార్కులు సాధించారు..