15 August, 2026 | 9:27 AM

మహాలక్ష్మి పథకంలో మరిన్ని బస్సులు

25-05-2024 12:36 AM

కరీంనగర్ సిటీ, మే 24: మహాలక్ష్మి పథకంలో భాగంగా కరీంనగర్ జోనల్ పరిధిలో మరిన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ జోనల్ మేనేజర్ సీ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో జోన్ పరిధిలోని రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. బస్సులకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌ఎంలు సోలమన్, వెంకన్న, శ్రీలత, జానీరెడ్డి, సుచరిత, డిప్యూటీ ఆర్‌ఎంలు సత్యనారాయణ, భూపతిరెడ్డి, భాను కిరణ్, మాధవరావు, సరస్వతి, పవిత్ర, ప్రణీత్, ప్రవీణ్, సుగుణాకర్, స్వప్నకుమారి, విలాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-జోనల్ మేనేజర్, వినోద్ కుమార్