06-09-2025 12:40:53 AM
నారాయణఖేడ్, సెప్టెంబర్5(విజయక్రాంతి): ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో చో టు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నిజాంపేట్ గ్రామానికి చెందిన బూసి రాములు, సాయమ్మల కుమార్తె ప్రేమల(23)ను నిజాంపేట్ మండలంలోని దామర చెరువు గ్రామానికి చెందిన సంగమేశ్‌కు ఇచ్చి నాలుగు నెలల క్రితం వివాహం జరిపారు.
ఈ క్రమంలో వారికి ధనుష్(3), సూర్యవంశి(3 నెలలు) ఇద్దరు కుమారులు జన్మించారు. గురువారం ప్రేమలను సంగమేశ్ దామరచెరువు నుంచి నిజాంపేట్ గ్రామానికి తీసుకువచ్చి అత్తగారి ఇంటి వద్ద వదిలివెళ్లాడు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ ప్రమీ లతోపాటు ఇద్దరు కుమారులు ధనుష్, సూ ర్యవంశీలు ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు.
ఇంటి తలుపు బయట గడియ పెట్టి ఉండగా తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి వారు విగతజీవులుగా పడి ఉండడం గమనించి నిర్ఘాంతపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న నారాయణఖేడ్ ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి వివరాలు సేకరిఇంచారు.
ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి ప్రేమల ఆత్మహత్య చేసుకుందా? లేక వారి ముగ్గురిని వేరే ఎవరైనా హత్య చేసి ఉన్నారా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ సంఘటన నారాయణఖేడ్ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.