calender_icon.png 30 September, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌ను కలిసిన మదర్ డైరీ డైరెక్టర్

30-09-2025 01:15:29 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంధిలా భాస్కర్ గౌడ్  సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను  తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా  భాస్కర్ గౌడ్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, పార్టీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉన్నారు.