calender_icon.png 30 September, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక నగారా

30-09-2025 02:29:50 AM

షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 

మొదటిదశ ఎన్నికలకు అక్టోబర్ 9న నోటిఫికేషన్

  1. రెండో దశ ఎన్నికలకు ఇదే నెల 13న.. 
  2.    23, 27వ తేదీల్లో ఎన్నికలు.. నవంబర్ 11న లెక్కింపు, ఫలితాలు 
  3. మూడు దశల్లో పంచాయతీ, వార్డుసభ్యుల ఎలక్షన్ 
  4. పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల
  5. తక్షణం అమల్లోకి ఎన్నికల కోడ్.. నవంబర్ 11 వరకు కొనసాగింపు 
  6. వివరాలు వెల్లడించిన ఎస్‌ఈసీ రాణికుముదిని

* ఆశావహులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నికల ప్రకటనపై నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. రెండు దశల్లో ప్రాదేశిక (జడ్పీటీసీ, ఎంపీటీసీ), మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది.

షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని, నవంబర్ 11 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వెలువడటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఎక్కడ చూసినా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలపైనే చర్చ సాగుతున్నది. పంచాయతీలు, వార్డుస్థానాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఏ సామాజిక వర్గాలకు రిజర్వ్ అయ్యాయనే అంశంపై ఆశావహులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు తగిన పత్రాలు సమకూర్చుకుంటున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.


హైదరాబాద్,సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం          (ఎస్‌ఈసీ) ఎన్నికల షెడ్యూ ల్ విడుదల చేసింది. మొదట రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూ ల్ విడుదలైన రోజు నుంచి ఐదు దశల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే వరకు (నవంబర్ 11) ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేసిం ది.

హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం(ఎస్‌ఈసీ)లో డీజీపీ జితేందర్,  పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్ర టరీ శ్రీధర్‌తో కలిసి కమిషనర్ రాణికుముదిని వివరాలు వెల్లడించారు. రాష్ట్రం లోని 31 జిల్లాల పరిధిలోని 560 మండలాల పరిధిలోని 5,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి 13 వరకు  నామినేషన్లు స్వీకరిస్తామని, 23న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండో విడత అక్టోంబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరించి, 27న  పోలింగ్ నిర్వహిస్తామ న్నారు. రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. 

వచ్చే నెల 17న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్.. 

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 17న ఎన్ని కల నోటిఫికేషన్ విడుదల చేయనున్న ట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. పంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్  ప్రక్రియ మధ్యాహ్నం వరకు ఉంటుందని వివరించారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12,733 సర్పంచి, 1,12,288 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలకు జరుగుతాయని వివరించారు.

పంచాయతీల్లో తొలివిడత ఎన్నికలు ఈ నెల 31, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవబర్ 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి, ఇప్పటికే రిజర్వేషన్ల జాబితా రాష్ట్రప్రభుత్వం నుంచి అందిదని, వాటి ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 

ఆ పంచాయతీల్లో నో ఎలక్షన్స్..

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటికీ, హైకోర్టు స్టే కారణంగా కరీంనగర్, ములుగు జిల్లాల పరిధిలోని 14 ఎంపీటీసీలు, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.