calender_icon.png 30 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాంక్షలకు అడుగుదూరం!

30-09-2025 02:04:21 AM

  1. బీసీల దశాబ్దాల కల సాకారానికి మార్గం సుగమం
  2. రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల నిర్వహణే తరువాయి..
  3. పరిపాలనలో పెరగనున్న బీసీల భాగస్వామ్యం
  4. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా బడుగుల అడుగులు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి) : ఒక్క అడుగు.. బీసీల ఆకాంక్షలు, కల నెరవేరే సమయం ఆసన్నమయ్యింది. దశాబ్దాలు గా ఎదురుచూస్తున్న శుభతరుణం కనుచూపు మేరలో కనపడుతోంది. రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే ఇక మిగిలింది. సమాజంలో నెలకొన్న అసమానతలు రూపుమాపేందుకు రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఇప్పటి వరకు అన్ని వర్గాలు ఆయా పరిధుల్లో లబ్ధి పొందారు.

కానీ బీసీలు జనాభా, ఓటింగ్, ఇతర అంశాల్లో వారి భాగస్వామ్యం ఉన్నంత స్థాయిలో లబ్ధి పొందలేదు. రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల పరంగా తగిన ప్రాధాన్యం లభించింది. కానీ, బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు బీసీలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల పరంగా ముందడుగు వేసేందుకు మార్గం సుగమమైంది. అందులో భాగంగానే ప్రస్తు తం రాజకీయాల్లో వారికి తగిన ప్రాధాన్యత లభించనున్నది.

ఏళ్ల తరబడి రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న బీసీల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వారికి అన్ని రంగాల్లో  ప్రోత్సాహాన్ని అందిస్తుంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంలో బీసీలే సింహభాగంలో ఉంటారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో బీసీల ప్రాధాన్యత పెరగడం మొదలైంది.  

న్యాయ పరమైన చిక్కులు రాకుంటే..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన చేపట్టి లెక్కలు తీసింది. దీనికి అనుగుణంగా బీసీ బిల్లు ఆమోదించి,ఆర్డినెన్స్ రూపొందించింది. అవి పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యేక జీఓ ఆధారంగా రిజర్వేషన్ల అమలు చేయాలని పూనుకున్న ది. అందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ, పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ దశల్లో ఆయా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలుకు చేరువయ్యారు. బీసీల ఆకాం క్షలు, రాజకీయ లక్ష్యం నెరవేరేందుకే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు న్యాయ పరమైన చిక్కు లు తలెత్తకుండా ఉంటే బీసీలకు రాజకీయాల్లో వారు ఆశించిన స్థాయిలో ప్రాధా న్యత లభించింనట్టు అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. 

ఇకపై రాజకీయాల్లో కీలక పాత్ర  

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీల ప్రాతినిధ్యం పెరగనున్నది. పార్టీలకు అతీతంగా స్థానికంగా పరిపాలనలో బీసీల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా రాజకీయా ల్లో కీలక పాత్ర పోషించేందుకు అవకాశం లభించనున్నది. వాస్తవానికి రాష్ట్రంలో దాదా పు 56శాతం బీసీలే ఉన్నారు. అయితే జనా భా దామాషా ప్రకారం వారికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయంగా తగిన అవకాశాలు లభించలేదు.

దీనికి ప్రధాన కారణంగా చట్టాల రూపకల్పనలో బీసీల ప్రాతి నిధ్యం ఎక్కువగా లేకపోవడమే అని బలంగా విశ్వసించారు. అందులో భాగంగా రాజకీయంగా ప్రాతినిధ్యం పెరిగితేనే వారి ఆకాం క్షలను నెరవేర్చుకోగలమని పోరాటం చేశా రు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతైనా బీసీలకు రిజర్వేషన్ సాధ్యమవుతుందని భావించారు. కానీ గత పదేళ్లు కూడా ఈ విషయంపై పెద్దగా అడుగులు ముందుకు పడలేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో బీసీలు గంపగుత్తాగా ఆ పార్టీకే మద్దతు తెలిపారు. దాంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలుపుకుంటూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీఓ విడుదల చేసింది. మొత్తంగా బీసీల రిజర్వేషన్ అమలు కు స్థానిక సంస్థల ఎన్నికలే కేంద్రం కానున్నా యి. ప్రస్తుత ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధించిన బీసీలు రాబోయే రోజుల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.   

దేశంలోనే తొలి సామాజిక మార్పు 

దేశంలోనే తొలి సామాజిక మార్పునకు శ్రీకారం చుడుతున్న తెలంగాణకు మద్దతు ఇవ్వాలి. తెలంగాణలో సామాజిక న్యాయం గురించి ఆలోచించే వారంతా బలహీన వర్గాల గొంతుకకు మద్దతు తెలపాలి. సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ పార్టీ. బీసీలు ఎవరికీ వ్యతిరేకం కాదు, సామాజిక మార్పు దిశగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి. రాబోయే కాలంలో సామాజిక న్యాయానికి తొలి ప్రజాప్రతినిధులు కొలువుదీరుతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రకటిం చాం. రాజకీయ భేషజాలకు పోకుండా అన్ని రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేస్తాం. బీసీ రిజర్వేషన్లపై కలిసి ముం దుకు పోదామని కోరతాం.  

 పొన్నం ప్రభాకర్, 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి