30-09-2025 01:16:48 AM
ప్రభుత్వానికి సర్పంచ్‌ల సంఘం జేఏసీ వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : గ్రామ అభివృద్ది కోసం సర్పంచ్‌లు చేసిన బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయవద్దని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బిల్లులు రాకపోవడంతో చాలా మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు కూడా తమ బిల్లులు చెల్లించకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఇబ్బందుల కు గురి చేయవద్దని కోరారు.
సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా య కార్యదర్శి కె. వెంకటేశ్వరావుకు సర్పం చ్‌ల సంఘం జేఏసీ కన్వీనర్ సుర్వి యాదయ్యగౌడ్ సీఎంకు రాసిన లేఖ అందజేశారు. గ్రామపంచాయతీల కార్మికులకు, కార్యదర్శులకు రూ. 104 కోట్లు విడుదల చేయడం మంచిదేనని, కానీ మా సర్పంచులు మీకు ఏం పాపం చేశారు..? మా మీద ఈ కక్ష సాధింపు ఎందుకు..?
కొంతమంది సర్పంచులు అప్పుల బాధతో ఈ దసరా పండగకు కూడా దూరమయ్యే పరిస్థితిలో ఇప్పటికైనా మీరు ఎన్నికలు నిర్వహించే లోపు మా బిల్లును చెల్లింపులో భరోసా కల్పించండి ’ అని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశ బోయిన మల్లయ్య, మెడబోయిన గణేష్, ఫకీర బీరప్ప, స్వప్న అంజయ్య గౌడ్ , పూర్ణచంద్ర గౌడ్ , అరవింద్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.