6 August, 2026 | 2:33 AM

తల్లి పాలే పిల్లలకు శ్రీరామరక్ష

06-08-2026 12:00 AM

సదాశివనగర్, ఆగస్టు5 (విజయక్రాంతి): మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి సరోజ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను సూపర్వైజర్ పద్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్ వైజార్ పద్మ మాట్లాడుతూ పుట్టి బిడ్డకు మొదటిగా ఇచ్చే తల్లి పాలు శ్రీరామ రాక్ష అని అన్నారు.అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భవతులు,పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రతి ఒక్కరు తమ పిల్లలను ముందుగా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలన్నారు. అలాగే గర్భవతులు, బాలింతలు తప్పకుండా అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని ప్రతిరోజు తీసుకొని బలంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు బొల్లిపల్లి సరోజ,పైడి శశిరేఖ,మంజుల, దాసరి బుజ్జి, కమ్మరి వాణి,ఎడ్ల నరసవ్వ,పోతరాజు ఈదవ్వ,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.