calender_icon.png 14 August, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిడ్డపై లైంగిక దాడి చేయించిన తల్లికి 22 ఏళ్ల జైలు

13-08-2025 12:42:44 AM

నల్లగొండ టౌన్, ఆగస్టు 12 : సొంత బిడ్డపై అత్యాచారం చేయించిన కేసులో తల్లికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమాన విధించిన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ పట్టణానికి చెందిన గ్యారాల శివకుమార్ యాదమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే యాదమ్మ కూతురుపై కన్నేసి ఆమె సహకారంతో అతడు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వారిపై 2023లో నల్లగొండ వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి రోజారమణి మంగళవారం యాదమ్మకు 22 ఏళ్లపాటు జైలు శిక్ష,రూ 5 వేల జరిమానా విధించారు. కోర్టుకు హాజరుకాకుండా పరారీలో ఉన్న శివకుమార్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.