calender_icon.png 16 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత

13-08-2025 12:44:26 AM

-ఈ ఏడాది వరుసగా మూడోసారి..

నాగార్జునసాగర్/నకిరేకల్, ఆగస్టు 12: ఓవైపు వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వదర ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి మంగళవారం జలాశయం నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,23,802 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,73,651 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలుగా ఉంది. మొత్తం 1,73,651 క్యూసెక్కులు నీరు ఔట్‌ఫ్లో రూపంలో ప్రాజెక్టు నుంచి వెళ్తుంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఎగువ నుంచి లక్షా 86 వేల 384 క్యూసెక్కులు వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు ౧.౮౬ లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 

మూసీ నాలుగు గేట్లు ఎత్తివేత 

భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు మంగళవా రం ప్రాజెక్టు నాలుగు క్రస్టుగేట్లను 5 ఐ దు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఎగువ నుంచి మూసీకి 13,187 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 12,903 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.