calender_icon.png 13 August, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగానికి నాలుగో పిల్లర్ మీడియా

13-08-2025 12:41:23 AM

బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ బి.కే. సుమంగళ

సంగారెడ్డి, ఆగస్టు 12: సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలో మంగళవారం బ్రహ్మకుమారీస్ సంస్థలు పత్రికా సోదరులకు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రహ్మకుమారీస్ సంస్థ డైరెక్టర్ బి.కె సుమంగళ పాల్గొన్నారు. రాజ్యాంగానికి నాలుగో పిల్లర్ మీడియా అని ఆమె తెలిపారు. మీడియాలో పనిచేసే వ్యక్తులు ఈ రోజుల్లో చాలా సమ యం బిజీగా ఉంటారు.

అయినప్పటికీ కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించి మానసికంగా శాంతి అనుభూతి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీదర్ బ్రహ్మకుమారి సెంటర్ ఇన్చార్జి బి.కే. సునంద, బి.కే. అన్నపూర్ణ, బీ.కే. జగదీశ్వర్, బి.కే. రాజవర్ధన్, బి కే సంతోష్, బి.కే. రాధిక విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి అంజయ్య, విశ్రాంత సైనికులుపాల్గొన్నారు.