calender_icon.png 8 January, 2026 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్లలో గేమ్ లు బారి నుంచి మైదానాలకు

07-01-2026 12:10:09 PM

  1. హాట్ ఎయిర్ బెలూన్లలో ప్రయాణానికి ఆన్ లైన్ బుకింగ్
  2. ఆకాశంలో డ్రోన్లతో ఫుట్ బాల్ ఆడే వినూత్న కార్యక్రమం
  3. తెలంగాణ టూరిజం సరికొత్త పుంతలు తొక్కే కార్యక్రమాలు
  4. చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్
  5. జనవరి 16-18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
  6. చేనేత వస్తువుల స్టాళ్లు ఏర్పాటు

హైదరాబాద్: తెలంగాణలో సంక్రాంతి పండుగను(Sankranti festival) వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) వెల్లడించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2026( International Kite and Sweet Festival) వివిధ రాష్ట్రలకు చెందిన 1200 రకాల మిఠాయిలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. చేనేత వస్తువుల విక్రయానికి స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి జూపల్లి సూచించారు. హాట్ ఎయిర్ బెలూన్లు 2500 అడుగులు ఎత్తు వరకు వెళ్తాయన్నారు. హాట్ ఎయిర్ బెలూన్లలో ప్రయాణానికి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.

ఆకాశంలో డ్రోన్లతో ఫుట్ బాల్(Football with drones) ఆడే విధంగా వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ టూరిజం(Telangana Tourism) సరికొత్త పుంతలు తొక్కే కార్యక్రమాలు చేపడనున్నట్లు ప్రకటించారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. బతుకమ్మ కుంట, నల్లచెరువు, తుమ్మిడికుంట వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. ఫోన్లలో గేమ్ ల బారి నుంచి మైదానాలకు మళ్లించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి సూచించారు. నెలలలో కనీసం రెండ్రోజుల పర్యాటక ప్రాంతాలకు ప్రజలు వెళ్లాలని పిలుపునిచ్చారు. పర్యాటక అనుబంధ రంగాల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జూపల్లి కృష్ణారావు  తెలిపారు.