21 August, 2026 | 2:33 AM

జీవో 97 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం

21-08-2026 01:37 AM

గద్వాల, ఆగస్టు 20: శక్తి స్కీమ్, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నాలుగు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. జీవో 97తో పాలిటెక్నిక్ విద్యకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జీవోను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్ కురువపల్లయ్య హెచ్చరించారు.