calender_icon.png 22 August, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

21-08-2025 11:14:38 PM

నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి..

కరెంట్ తీగల కనెక్షన్ విషయంలో యువత జాగ్రత్త సంబంధిత అధికారులని సంప్రదించాలి..

నర్సంపేట (విజయక్రాంతి): రానున్న వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవాలని నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి(ACP Ravinder Reddy) పిలుపునిచ్చారు. గురువారం నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏసిపి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతికి, ఐక్యతకు ప్రతీకలని, వాటిని సహోదర భావంతో జరుపుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గణేష్ నవరాత్రులలో డీజే సిస్టమ్‌లకు ఎలాంటి అనుమతి లేదని ఆయన పునరుద్ఘాటించారు. సోషల్ మీడియా ద్వారా వ్యాపించే అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే అభ్యంతరకర పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటివి దృష్టికి వస్తే వెంటనే (100) కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టౌన్ సి రఘుపతి రెడ్డి, ఎస్సైలు రవికుమార్ అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.