21-08-2025 11:33:19 PM
తెల్లారేసరికే పోలీసులు ఇంటి వద్ద వాలుతున్నారు.!
ముఖ్యమంత్రికి బానిసలుగా, తొత్తులుగా పోలీసులు.
ఈ ప్రభుత్వం మళ్లీ రాదు. పోలీసులు భూమ్మీద ఉన్న ఆకాశం మీద ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తెల్లారే ఆ వ్యక్తి ఇంటి ముందు పోలీసులు వాలిపోతున్నారని ముఖ్యమంత్రికి తోత్తులుగా, బానిసలుగా వ్యవహరిస్తున్నారని పోలీసు అధికారులు భూమ్మీద ఉన్నా ఆ పైన ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ యువ సమ్మేళనంలో కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీసుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి 20 ఏళ్ల దాకా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంత ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు పూర్తిగా రాసి పెట్టుకుంటున్నామని వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారని కానీ బీఆర్ఎస్ వారికి హక్కులు కల్పించడం లేదని ఆరోపించారు. పోలీసులు అంటే అపారమైన గౌరవం ఉందని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.