21-08-2025 11:06:06 PM
తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: నిరుపేదలకు సొంత గూడు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని అందుకు తాపీమేస్త్రీలు, సిమెంటు, సెంట్రింగ్ నిర్వాహకులు తక్కువ ధరకే స్టీలు, సిమెంటు అందించి లబ్ధిదారులకు అండగా నిలవాలని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్(Tahsildar Srikanth) కోరారు. గురువారం మండల కేంద్రం అర్వపల్లిలోని తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులు, మేస్త్రీలు, సిమెంటు, ఐరన్ షాప్ ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సూచించిన విధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, సుతారీ మేస్త్రీలు ధరల నియంత్రణ పాటించి లబ్ధిదారులకు స్టీలు, సిమెంటు మార్కెట్ కంటే తక్కువ ధరకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డిప్యూటీ డీఈ జబ్బార్ హైమద్, ఏఈ పూజశ్రీ, డీలర్లు ఎల్లయ్య, శ్రీకాంత్, నరేష్, తాపీమేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.