calender_icon.png 22 August, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్ కు వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు

21-08-2025 11:10:05 PM

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): పెద్ద కొడప్గల్ గురువారం బిజెపి  మండల అధ్యక్షులు మల్లయల సుభాష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలో ఎమ్మార్వోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత మూడు రోజుల నుండి అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది కావున ప్రభుత్వం నుండి 35 వేల నుండి 45 వేల వరకు పంట నష్టపరిహారం ఇప్పించాలని  రాష్ట్రం తరఫున కట్టవలసిన ఫసల్ భీమా యోజన పథకం ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపారు.

యాసంగిలో రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం 3 నెలలు గడుస్తున్న బోనస్ వెయ్యడం లేదు కాబట్టి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున వ్యవసాయ కూలీలకు ఏటా 12000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడమైనది. పెద్దకొడఫ్గల్ మండలం లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ రోడ్లు నీటి సమస్యలు చాలా ఉన్నాయి .గ్రామ పంచాయతీ నిధులు రాక గ్రామ అభివృద్ధి కుంటు పడిపోతావున్నది సెంటర్ లైటింగ్ సమస్యలు ఉన్నాయి వీటిని వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించగలరని  తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మల్లయల సుభాష్ సీనియర్ నాయకులు జిల్లా కౌన్సిల్ మెంబర్ కృష్ణపంతులు మాజీ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.