21-08-2025 11:41:00 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లికి చెందిన సంఘ సేవకుడు, నిస్వార్ధకుడు కుడిపూడి కొండబాబు సేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు. కుడిపూడి కొండబాబు గత 15 సంవత్సరాల నుంచి బెల్లంపల్లి కోల్బెల్ట్ ప్రాంతంలో నిసార్థంగా సేవలు చేస్తున్నారు. నేతాజి సుభాష్ చంద్రబోస్ సేవాసమితి" అనే స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. ఏ కారణం చేతనైనా హాస్పిటల్వలలో మరణిస్తే వారు ఒక మార్చురివ్యాన్ ద్వారా వారి మృతదేహాలను వారి వారి ఇండ్లకు ఉచితంగా చేరవేస్తాడు. ఇవే కాకుండా పేదలకు అన్నదానాలు, శిధిలమైన మందిర భాగాల్నిబాగు చేయడం వేరే ప్రాంతం నుండి వచ్చిన పేద ప్రజలకి సదుపాయాలు కల్పించడం, చేస్తువుంటారు.
ఆయన సంఘ సేవలను గుర్తించిన మధర్ పౌండేషన్ మోగాసిటి నవకణవేదిక అనే స్వచ్చంద సంస్థ, హైదరబాద్ వారు రెండు తెలుగు రాష్ట్రాలనుండి 29 మంది సాంఘ సేవలో నిమమగ్నమైన వివిధ రంగాలకి చెందిన వ్యక్తుల్ని 2025 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి సేవా రత్న అవార్డుకు ఎంపిక చేశారు. ఈ రాష్ట్రస్థాయి సేవారత్న అవార్డు కి ఎంపికైన కొండబాబు ఈనెల 25 న రవీంద్రభారతిలో సేవా రత్న అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రస్థాయి సేవా రత్న అవార్డుకి ఎంపికైన కొండబాబును బెల్లంపల్లి ప్రముఖ న్యాయవాది ఠాగూర్ గోపికిషన్ సింగ్ అభినందించారు.