calender_icon.png 22 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నీ

21-08-2025 11:30:24 PM

గచ్చిబౌలి: పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ(Pullela Gopichand Badminton Academy)లో జరుగుతున్న కోటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ 2025 అండర్-19 విభాగంలో గురువారం ప్రి-క్వార్టర్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరిగాయి. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రౌనక్ చౌహాన్ ప్రణవ్ మంజునాథ్‌పై 21-12, 21-16తో విజయం సాధించాడు. నార్త్‌ఈస్ట్ నుండి వచ్చిన ప్రతిభావంతుడు బోర్నిల్ ఆకాష్ చాంగ్మై ఆదిత్య త్రిపాఠిని సులభంగా మట్టికరిపించాడు. 4వ సీడ్ సూర్యాక్ష్ రావత్ అర్యన్ తల్వార్‌పై నేరుగా గేమ్స్‌లో గెలిచాడు.

అలాగే అన్ష్ నేగి, ప్రనౌవ్ రామ్ నగలింగం, ధ్యాన్ సంతోష్, టంకర గ్నానదత్తు తలసిల, ఇరాన్‌కు చెందిన అమిరాలి అహ్మద్‌లూ తదుపరి రౌండ్‌కి అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో సంచలనం సృష్టిస్తూ తన్వి పత్రి టాప్ సీడ్ ఇషితా నేగిను 21-17, 21-12తో ఔట్ చేసింది. 3వ సీడ్ శ్రియాంశి వలిశెట్టి, 7వ సీడ్ నవ్య కందేరి విజయాలు సాధించగా, తనూ చంద్ర, తన్వి రెడ్డి అండ్లూరి, దిక్షా సుధాకర్, ఆదర్షిని శ్రీ బూపతి బాలాజీ, ఐక్య శెట్టి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో భవ్య ఛాబ్రా–లాల్‌రంసంగా జోడీతో పాటు గోకుల్–విశాంక్, అమన్