21-08-2025 11:18:26 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 45లో ధ్వంసమైన ఎర్రకుంట చెరువును గురువారం సాయంత్రం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్(Sub Collector Manoj) పరిశీలించారు. సోమవారం ఎర్రకుంట చెరువును కొంతమంది వ్యాపారులు ధ్వంసం తమకు జీవనోపాధి లేకుండా చేశారని కన్నాల మాజీ సర్పంచ్ మంద అనిత సమక్షంలో మత్స్యకారులు, రైతులు జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే ఎర్రకుంట చెరువును పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించడంతో గురువారం సబ్ కలెక్టర్ మనోజ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎర్రకుంట చెరువును పరిశీలించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తెలిపారు.