calender_icon.png 2 December, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో సమన్వయ కమిటీలతో ముందుకు

02-12-2025 01:10:44 AM

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్

నిర్మల్, డిసెంబర్ ౧ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా తనపై బాధ్యతలు ఉంచి పదవి కట్టబెట్టిన పార్టీ ఆదేశాలను జిల్లా లో పాటిస్తూ పార్టీ నేతల మధ్య సమన్వయం తో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జు పటేల్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యమున నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాతా కొత్త తేడా లేకుం డా జూనియర్ సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేస్తామని భరోసా కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ధరలను గెలిపించుకునే బాధ్యత సీనియర్ నేతలదేనని తేల్చి చెప్పారు. ఈనెల 4న ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని ప్రకటించారు.

ప్రజల ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేస్తుందని ప్రజల కోసం హామీలు ఇచ్చిన ప్రతి ఆమె ని నిలబెట్టుకున్నామని తెలిపారు. జిల్లాలో టిఆర్‌ఎస్ బిజెపి పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కోల్పోయాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నీవే కొరకు ఇం చార్జ్ శ్రీహరి రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ అలీ. పార్టీ నాయకులు వెంబడి రాజేశ్వర్ సోమ భీమారెడ్డి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ధర్మాజీ రాజేందర్ కృష్ణవేణి రామ్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.