calender_icon.png 2 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా, రాహుల్‌పై కేసులు రాజకీయ కక్షే

02-12-2025 01:12:00 AM

డీసీసీ అధ్యక్షురాలు సుగుణ

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్1 (విజ య క్రాంతి): నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రె స్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ను  డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తీవ్రంగా ఖండించారు. సోమవారం తిర్యాని మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

దేశ ప్రజలకోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.దేశంలో పెరుగుతు న్న ప్రజాభిమానం, కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న మద్దతుతో భయభ్రాంతులకు గురైన  బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు.

ప్రజలను మోసం చేయడంలో విఫలమైన బీజేపీ దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కేసులు సృష్టిస్తోందని  వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు పని చేయవ ని, కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.