16 May, 2026 | 2:09 AM

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

16-05-2026 12:28 AM

నిర్మల్ మే 15 (విజయక్రాంతి): మామడ మండలంలోని పరిమండల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ నాగేష్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభివృద్ధి పనులు ప్రారంభించారు.మామడ మండలం పరిమండల్ గ్రామంలో రూ. 20 లక్షలతో SHG VO భవన నిర్మాణానికి, రూ. 20 లక్షలతో SHG VO వర్కింగ్ షెడ్ ల నిర్మాణానికి, రూ. 13.50 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ప్రారంభానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామంలోని ప్రజా సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులను ఆదేశించి త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సూచించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ , సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండ్ర రాజారెడ్డి, సత్యం చంద్రకాంత్, గ్రామ సర్పంచ్ మల్లేష్, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.