calender_icon.png 12 May, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

11-05-2025 10:46:45 PM

ప్రత్యేక పూజలు జరిపిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డింపుల్ దంపతులు,కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్సేన పూజ,పుణ్యాహవచనం,హోమం, రుత్విక్ వరణం, లక్ష కుంకుమార్చన, వెంకట తిరుపతి అలంకార సేవ నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ ముఖ్యమని, పాకిస్తాన్ లో జరుగుతున్న యుద్ధంలో భారత్ కు విజయం లభించాలని, ఆపరేషన్ సింధూరలో పాల్గొన్న ప్రతి సైనికునికి సంఘీభావం తెలియజేస్తూ సంకల్పం చేసి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, మేకల రాంబాబు, బాకు మల్లయ్య, బాషపోలు శ్రీను, కందుకూరి మహేష్, బింగి కృష్ణమూర్తి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.