calender_icon.png 12 May, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ మండల అధ్యక్షుల ఎన్నిక

11-05-2025 10:36:29 PM

తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల మండలాల నూతన అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొర్రూరు మండల అధ్యక్షునిగా భోగ భాస్కర్, పెద్దవంగర మండల అధ్యక్షునిగా బయన్న బిక్షపతి, కొడకండ్ల మండల అధ్యక్షునిగా ఎరుకల శ్రీనివాస్ గౌడ్ లను ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు బొక్క రామచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ సముద్రాల సోమయ్య, రెజ్జెల్లి వెంకటేశ్వర్లు, గణపురం ఎల్లయ్య, కడుదుల రామయ్య, గుగులోతు రమేష్, బొలగాని చిత్తారంజన్, వేల్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.