16-09-2025 12:43:49 AM
ముస్తాబాద్, సెప్టెంబర్ 15( విజయ క్రాంతి); రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో వికలాంగులకు పెన్షన్లు పెంచాలని మహాధర్నా కార్యక్రమం చేపట్టి ఎమ్మార్వో రాజేందర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా తాహసిల్దార్ కార్యాలయముల ముట్టడి లో భాగంగా సోమవారం ముస్తాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముట్టడించి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు.ప్రభుత్వం వృద్ధులకు,వితంతువులకు , బీడీ కార్మికులకు,చేనేత,గౌడ, చైత పెన్షన్దారుల పెన్షన్ 2 వేల రూపాయల నుండి 4 వేల రూపాయలకు పెంచాలన్నారు.
వికలాంగులకు 4 వేల నుండి 6వేల రూపాయలకు రక్తహీనతతో బాధపడుతున్న వారికి 15 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వికాలాంగుల ఇంచార్జి శోభ మండలంలో ని అన్ని గ్రామాల నాయకులు,వివిధ గ్రామాల వికలాంగులు,వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.