22-08-2025 05:57:10 PM
రైతు బతుకు అమాస
బిజెపి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో రైతులు ఎరువుల కోసం గోస పడుతున్నారు. ఇది పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని దీని ద్వారా రైతుల బతుకు ఆమాసగా మారుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి విమర్శించారు. భారతీయ కిసాన్ మోర్చా నల్గొండ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని శుక్రవారం జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేయాలని వారు అందుబాటులో లేని కారణంగా ఏఓ మోతీలాల్ నాయక్ కు కలిసి వినతి పత్రం అందజేసి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కోమటి రెడ్డి కమిషన్ లకోసం జిల్లాలో యూరియా కొరత గత 10 సం.లలో లేని కొరత ఇప్పుడు ఎక్కడిది అని మండిపడ్డారు. ఇబ్బ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరుబాట పడితే, యూరియా ఎందుకు ఇవ్వడంలేదంటూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యహరిస్తుందన్నారు.రైతులు పొలాల్లో ఉండాలి కానీ బజార్లో ఎందుకున్నారని యూరియా ఇయ్యలేక రైతన్నను రోడ్డుమీద నిలబెట్టిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సిగ్గు అనిపించడం లేదా అన్నారు.
మరో మంత్రి కొరత లేదు, పత్రికలే సృష్టిస్తున్నయని మంత్రి పొన్నం అంటుంటే, కొరత ఉన్నదని మరో మంత్రి పొంగులేటి అంటున్నాడని విమర్శించారు.నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కమీషన్ల దందా వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని గత పదేండ్లలో లేని యూరియా కొరత ప్రస్తుతం రైతులను వేధించడానికి కారణమని అన్నారు.మంత్రులకు కమీషన్ల మీద ఉన్న సోయి రైతులపై లేకపోవటం సిగ్గు చేటన్నారు.వానకాలం సీజన్ ప్రారంభమై రైతులు ఇబ్బందులు పడితే కనీసం సమస్య ఎక్కడుంది అనే దానిపై ఇప్పటికీ ఒక్కసారి కూడా జిల్లా మంత్రులు ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు.
ఈ సీజన్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 75వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడగా, ఇప్పటి వరకు 33 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఒక్క బస్తాకు రూ.266 ఉంటే రైతులు రూ.400 పెట్టి బ్లాక్ లో కొనాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయకపోతే రైతలతో కలిసి బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని అన్నారు.