20 March, 2026 | 12:15 AM

సాగర్‌కు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతి

05-12-2024 10:23 PM

నల్లగొండ,(విజయక్రాంతి):  నాగార్జున సాగర్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు రూ. 100 కోట్లు ఇవ్వాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్‌ను నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రిని కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధుల విడుదలకు సుముఖత వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో పర్యాటక  కేంద్రాలైన పానగల్, రాచకొండ, దేవరకొండ ఖిల్లాల ప్రాముఖ్యతను సైతం కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ వీటిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.