05-12-2024 10:29:00 PM
నిర్మల్,(విజయరంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ ఫథకాల్లో మహిళలకు అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ఎంతో మంది మహిళలకు ప్రయోజనం పొందుతున్నారని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం టీజీ ఆర్టీసి ద్వారా నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆమే పాల్గొన్నారు.మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు డిపో ద్వారా 11.23 కోటల మంది ప్రయాణికులు ఈ పథకం ఉపయోగించుకొన్నట్టు తెలిపారు.మహిళ రద్దికి అనుకూలంగా బస్సు సర్వీసులు పెంచాలని సూచించారు. డిపో 63 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనంతరం బస్టాండ్‌ను పరిశీలన చేసి ప్రయాణికులతో ఆర్టీసి సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రవీన్ కుమార్, ప్రతిమారెడ్డి తదితరులు ఉన్నారు.