29-07-2025 05:01:02 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో గల మోడల్ స్కూల్ హాస్టల్ లో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో జలంధర్ రెడ్డి(MPDO Jalandhar Reddy) సోమవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జలంధర్ రెడ్డి హాస్టల్ లో పైపులైన్ల రిపేర్లు, లైట్లు, ఫ్యాన్లు, కిటికీలకు జాలి, డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్య, స్నానానికి వేడి నీళ్లు రాకపోవడం, బాత్రూం కిటికీల దగ్గర జాలి ఏర్పాటు చేయడం, వంట చేసే మనుషులు తక్కువగా ఉండటం, చేతులు శుభ్రం చేసుకోవడానికి నల్లాలు ఏర్పాటు చేయడం వంటి సమస్యలు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, హాస్టల్లోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సమస్యలను ఉన్నతాధికారుల గురించి తీసుకెళ్తానని అన్నారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు.