29-07-2025 04:56:25 PM
ఆలయాల్లో భక్తుల సందడి..
మందమర్రి (విజయక్రాంతి): నాగ పంచమి పర్వదినాన్ని పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నాగ పంచమని పురస్కరించుకొని మంగళవారం తెల్లవారుజాము నుండి మహిళలు దేవాలయాలకు చేరుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి నాగ దేవతకు మొక్కులు తీర్చుకున్నారు. నాగపంచమి సందర్బంగా భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణంలోని మార్కెట్ ఏరియా శ్రీ వెంకటేశ్వర ఆలయం, యాపల్ శివకేశవ ఆలయాలతో పలు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి.