3 April, 2026 | 10:48 AM

ఉపాధి హామీ పని ప్రదేశాన్ని పరిశీలించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

10-02-2026 02:22 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఉపాధి హామీ  జరుగుతున్న ప్రదేశములు సందర్శించి, కూలీల హాజరు పరిశీలించారు. కూలీలకు ప్రతి పనిని తగిన నిర్దేశిత కొలతలతో చేసి ప్రతి రోజు పూర్తి వేతనం రూపాయలు 307 పొందాలని ప్రతి జాబ్ కార్డు 100 రోజులు పనిదినాలు పూర్తి చేయాలని, తగు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజన్న, ఈసీ మురళి, టి ఏ విజయ్,గ్రామ కార్యదర్శి వైకుంఠం  పాల్గొన్నారు.