calender_icon.png 1 August, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ సన్నాహక సభ విజయవంతం చేయాలి

31-07-2025 07:15:10 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): పెన్షన్ కోసం ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సన్నాహ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంద రాజు మాదిగ గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంద రాజు మాట్లాడుతూ.. ఆగస్టు 7న పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఈ సభకు హాజరవుతున్నారని తెలిపారు. వికలాంగుల ఆర్థిక భద్రత కోసం ఆసరా పింఛన్ పెంపు అత్యంత అవసరం. ప్రజల మద్దతుతో ప్రభుత్వం వద్దకు మా గళం వెళ్లాలి, అన్నారు.

ఈ సన్నాహక సభ, ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న "సింహగర్జన సభ" విజయవంతానికి ముందడుగుగా ఉంది. ఈ సభకు హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల MRPS ఇన్చార్జులు, వికలాంగుల నాయకులు, వివిధ మండలాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తునికి వసంత్ మాదిగ, మొలుగూరి అశోక్ మాదిగ, రోంటాల రాజు మాదిగ, అంబాల రాజు మాదిగ, మిట్టపల్లి రాజేష్ మాదిగ, ఎర్ర ఆదిత్య మాదిగ తో పాటు తదితరులు పాల్గొన్నారు.