30-07-2025 12:00:00 AM
సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు నిమ్మల మధు డిమాండ్
ములకలపల్లి, జూలై 29,( విజయక్రాంతి ):మొండి వర్రె గ్రామంలో వీధులు బురద మయంగా మారాయని వెంటనే గ్రామానికి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు నిమ్మల మధు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని మొండి వర్రె గ్రామాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మాస్ లైన్ కార్యక్రమంలో సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొండి వర్రె గ్రామంలో వీధులు బురద మాయంగా మారాయని బురదలో దోమలు, ఈగలు విపరీతంగా ఉన్నాయని దోమలు స్త్వ్రర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు విషజ్వరాలు, వివిధ రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. గ్రామంలో రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సిసి రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతుంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణ లోపం ఉందని ప్రజల సమస్యలు తెలుసుకోవాడం లో పంచాయతీ సెక్రటరీ విఫలం చెందారని నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ సెక్రటరీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు కావస్తున్న నేటికీ దోమల మందు పిచికారి చేయించ లేదని గ్రామాల పరిశుభ్రత పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పునాది పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ బిల్లుంచడంలో పంచాయతీ సెక్రెటరీ హౌసింగ్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మొండి వర్రె గ్రామంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోర్రా జోగయ్య,బోర్రా శ్రీను,కుర్సం కన్నయ్య,వూకె చుక్కయ్య,కుర్సం పోతురాజు, సీతమ్మ, శ్రీను,కమల,బోర్రా రమేష్, తదితరులు పాల్గొన్నారు.