27 July, 2026 | 1:04 AM

ఓంకు ముహూర్తం ఖరారు

27-07-2026 12:00 AM

ధనుష్ ప్రధాన పాత్రలో ఆర్ టేక్ స్టూడియోస్, ’వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా అమరన్ చిత్రం ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియ సామి దర్శకత్వంలో రూ పొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం చాప్టర్ 1’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీ ల కథానాయికలుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉండటం ఈ సినిమాపై అంచనాలను మ రింత పెంచింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వండర్బార్ ఫిలిమ్స్ ప్రతినిధి శ్రేయస్ వెల్లడించారు. అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి అని చెప్పారు. ఆర్ టేక్ స్టూడియోస్ ప్రతినిధులు శ్రద్ధ, అజ్మత్ మాట్లాడుతూ.. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని అన్నారు. ఈ సినిమాకు సినిమా టోగ్రాఫర్ ఎళిలరసు, ఎడిటర్‌గా కలైవనన్ వ్యవహరిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.