15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శివరాత్రి జాతరకు పోలీసుల హై అలర్ట్.. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి

07-02-2026 12:35 AM

వేములవాడ, ఫిబ్రవరి  6,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ మహా శివరాత్రి జాతరను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఫి బ్రవరి 14, 15, 16 తేదీల్లో జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయంలో ప్రత్యేక ఎంట్రీఎగ్జిట్ మార్గాలు, విస్తృత క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆలయ ప్రాంగణం అంతటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జనరల్, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ప్రదేశాలను వేర్వేరుగా గుర్తించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

పట్టణ ప్రధాన మార్గాల్లో రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులకు మార్గదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.జాతర రోజుల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగేలా చూడాలని ఎస్పీ సూచించారు. రహదారులు, పార్కింగ్, క్యూలైన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, ఆలయ ఈఈ రాజేష్, డీఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఇన్స్పెక్టర్ ఎడ్ల శివసాయి తదితరులు పాల్గొన్నారు.