15-11-2025 12:00:00 AM
కాంగ్రెస్ నాయకుల సంబురాలు
ఘట్ కేసర్, నవంబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పై భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఘట్ కేసర్ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ సంబురాలతో బాణాసంచా కాల్చడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, రైతు సొసైటీ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, రహీం, వి.బి. వెంకట్ నారాయణ ముదిరాజ్, డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులుయాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కె. నాగరాజు ముదిరాజ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు మేకల దాసు, కేశవ పట్నం ఆంజనేయులు, పి.శశిధరన్, బిబ్లాక్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు రఫీయుద్దీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొక్క సత్తి రెడ్డి, వేముల గోవర్ధన్ గౌడ్, జి. నరసింహా, కట్ట సుధాకర్ రెడ్డి, నాయకులు బొక్క నర్సింహరెడ్డి, గోరకంటి రవీందర్, కడపోల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.