25-07-2025 10:33:04 PM
మునిపల్లి: రూ. 31,250 విలువ చేసే ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు శుక్రవారం నాడు కంకోల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి, మునిపల్లి ఏఎస్ఐ బక్కన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం ఇరానీ గల్లీలో ఎండు గంజాయిని తక్కువధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు కొండాపూర్ ఎస్ ఐ సోమేశ్వరి, మునిపల్లి పోలీసులు వాహనాల తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ కారు, బైక్ పై అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేయగా అందులో 1,250గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించి విచారించగా రాయికోడ్ మండలం నాగన్ పల్లి గ్రామానికి చెందిన వడ్డె నర్సింలు, కొండాపూర్ మండలం గారకూర్తె గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి లు బీదర్ లోని ఇరానీ గల్లీలో తక్కువ ధరకు ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పట్టు బడిన ఎండు గంజాయితోపాటు ఒక కారు, ఒక స్ప్లెండర్ బైక్, నగదు 9,500, రెండు సెల్ ఫోన్లు లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో పోలీస్ కానిస్టేబుల్స్, హనీఫ్, పాండు, ఆనంద్, సంతోష్, డ్రైవర్ సునీల్ తదితరులు ఉన్నారు.