calender_icon.png 27 July, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురళీధర్‌రావు అక్రమాస్తుల కేసు.. ఏసీబీ దర్యాప్తులో కీలక విషయాలు

27-07-2025 12:06:34 AM

- ఆదాయానికి మించి రూ.2.7 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు స్పష్టం

- అక్రమాస్తుల్లో అధిక భాగం కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టు వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖ రిటైర్డ్ మాజీ ఈఎన్సీ చీటి మురళీధర్‌రావు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధి కారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐ దు రోజుల ఏసీబీ కస్టడీలో భాగంగా మురళీధర్‌రావును విచారించే క్రమంలో అధికా రులు శనివారం నాలుగో రోజు బ్యాంక్ లాకర్లను తనిఖీ చేశారు. మురళీధర్‌రావు 1976 లో సర్వీసులో చేరగా, ఆయనకు జీతాలు, అలవెన్స్‌లు కలిపి మొత్తం రూ.6.5 కోట్లు వచ్చినట్టు అధికారులు లెక్కతేల్చారు.

అయి తే, ఆయన వద్ద లభించిన డాక్యుమెంట్ల ప్రకారం రూ.9.2 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఆధారాలు లభించాయి. దీంతో ఆయన ఆదా యానికి మించి రూ.2.7 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు స్పష్టమైంది. ఈ అక్రమాస్తుల్లో అధిక భాగం తన కుమారుడు సాయి అభిషేక్ పేరిట రిజిస్టర్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఏసీబీ దర్యాప్తు బృందం గుర్తించిన ప్రకారం, మురళీధర్‌రావు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టారు.

అదేవిధంగా పలు కంపెనీల్లో ఆయన కుమారుడు సాయి అభిషేక్ పెట్టుబడులు పెట్టినట్టు కూడా దర్యాప్తులో తేలింది. మురళీధర్‌రావుకు సంబంధించిన మొత్తం ఆరు బ్యాంకు లాకర్లలో ఇప్పటివరకు మూడు లాకర్లను అధికారులు తెరిచి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టడీలో ఉన్న మురళీధర్‌రావును అక్రమాస్తుల వ్యవహారంలో విచారించగా సహకరించడం లేదని సమాచారం. అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.