calender_icon.png 27 July, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

27-07-2025 12:03:37 AM

జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బీ పాపిరెడ్డి..

మహబూబ్ నగర్ టౌన్: వివిధ కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బి పాపిరెడ్డి(District Principal Judge Papireddy) అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోలేని వారు సమాచారం ఇస్తే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా న్యాయవాదిని నియమించడం జరుగుతుందని తెలిపారు. కేసులు నమోదై జైలుకు వచ్చిన కాలేజీ విద్యార్థులను కేసుకు దారి తీసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం, ఆహారం నాణ్యతపై ఆరా తీశారు.

లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలులో ఉన్నతి కార్యక్రమం ద్వారా శిక్షణ పొందుతున్న ఖైదీలతో మాట్లాడారు. జైలులో వంటశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి ఇందిర, జిల్లా జైలు సూపరింటెండెంట్ ఏ వెంకటేశం, డాక్టర్ మిర్జా ముజ్తబబెగ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీందర్ నాయక్, సభ్యులు యోగేశ్వరరాజ్, మల్లారెడ్డి, పార లీగల్ వాలంటీర్ పి.యాదయ్య తదితరులు పాల్గొన్నారు.