27-07-2025 12:08:23 AM
- డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్సీ కొమురయ్య వినతి
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ సమస్యను పరిష్కరించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఈమేరకు డిప్యూటీ సీఎంను శనివారం కలిసి వినతిపత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు. సర్దుబాటు ప్రక్రియలో కొన్ని చోట్ల దాదాపు 90 కిలోమీటర్ల వరకు టీచర్లను బదిలీ చేయడంతో వారు ఒత్తిడికి లోనవుతున్నారని, ఇలాంటి వారిని వెంటనే పక్క మండలంలోని పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు. కేజీబీవీ, సమగ్రశిక్ష ఉద్యోగులకు సాధారణ బదిలీలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పై అంశాలను సావధానంగా విన్న డిప్యూటీ సీఎం తగిన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.