25-08-2025 12:25:38 AM
కేయూ సీఐ రవికుమార్
హనుమకొండ/ కె యు క్యాంపస్ ఆగస్టు 24 (విజయ క్రాంతి): గుర్తుతెలియని వ్యక్తుల నుండి మీ వాట్సప్ కు వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని కేయూ సీఐ ఎస్ రవికుమార్ అన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానిస్తున్నట్లు వచ్చే ఏపీకే ఫైల్స్ పై క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతాలో నుండి సొమ్మును దొంగిలించే అవకాశం ఉందని, తద్వారా మీరు సైబర్ నేరానికి గురవుతారని అన్నారు. ఏపీకే ఫైల్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి ఓటిపిలు గాని అడిగినట్లయితే చెప్పకూడదని సంబంధిత బ్యాంకు అధికారులను నేరుగా సంప్రదించి లావాదేవీలు చేసుకోవాలని అన్నారు.